రాష్ట్రంలోని అప్పుల విధానంపై కాగ్ ఆడిట్ జరిపించాలని ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రధాని మోదీని కోరారు. రూ. 25వేల కోట్ల అప్పుపై పూర్తి స్థాయిలో కాగ్‌తో ఆడిట్ జరిపించాలని కోరుతూ ప్రధానికి లేఖ రాశారు. ప్రభుత్వం ఖర్చు చేసే నిధులకు రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ పేరిట ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. సంక్షేమ పథకాల కోసం సుమారు సంవత్సరానికి రూ.10 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం ఉందన్నారు. చెప్పిందే చెప్పి.. చేసిందే చేసి.. ప్రచారాలు చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతిమంగా ఈ అప్పులకు ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. ఇవాళో రేపో అనర్హత వేటు వేసే వ్యక్తి మాటలు ఎందుకు వినాలి అని అనుకోవద్దని హితవు పలికారు.
RRR: ప్రచారాలు సరే.. అప్పులకు ఎవరు బాధ్యత వహిస్తారు.? ఎంపీ రఘురామ
ప్రధాని మోదీకి ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. ఏపీలో అప్పుల విధానంపై కాగ్ ఆడిట్ చేయించాలని కోరారు. సంక్షేమ పథకాల కోసం చెప్పిందే చెప్పి.. చేసిందే చేసి ప్రచారాలు చేసుకుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
mp raghu rama krishnam raju