దివంగత ప్రధాని పీవీ నర్సింహారావు చేసిన సంస్కరణల వల్లే దేశం ఈ స్థాయిలో ఉందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఆంధ్రప్రదేశ్లోనూ పీవీకి ఘనంగా నివాళులు అర్పించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఇదే విషయం సీఎం జగన్ కు తెలియజేశానని చెప్పారు. ఈ విషయంలో ప్రజలు కూడా సీఎంకు లేఖలు రాయాలని సూచించారు. గోదావరి జిల్లాల్లో ఆక్వా పరిశ్రమను మరింత అభివృద్ధి చేయాలన్న ఆయన...మత్స్యకారులకు అన్ని విధాలా సాయం చేయాలని కోరారు.
'పీవీకి ఏపీలోనూ ఘన నివాళులు అర్పించాల్సిన అవసరం ఉంది' - mp raghu rama krishnam raju comments on jagan
పీవీకి ఏపీలోనూ ఘనంగా నివాళులు అర్పించాల్సిన అసరం ఉందని ఎంపీ రఘురామకృష్ణరాజు అభిప్రాయపడ్డారు. దిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన...పీవీ తీసుకువచ్చిన సంస్కరణల వల్లే ఈ దేశం ఈ స్థాయిలో ఉందని అన్నారు.
!['పీవీకి ఏపీలోనూ ఘన నివాళులు అర్పించాల్సిన అవసరం ఉంది' mp raghu rama krishnam raju](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8204616-720-8204616-1595934425885.jpg)
mp raghu rama krishnam raju