కరోనాపై ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కోరారు. ప్రభుత్వం దృష్టికి ఎవరైనా సమస్యలు తీసుకొస్తే పరిష్కరించాలని అన్నారు. పథకాలన్నింటికి జగన్ పేరు పెట్టుకోవడం అలవాటైందని వ్యాఖ్యానించారు. కరోనా విషయంలోనూ జగనన్న కరోనా కేర్ లేదా మరేదైనా పేరు పెట్టుకోండని సూచించారు. ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా చర్యలు తీసుకోవాలని హితవు పలికారు.
పథకాలన్నింటికి జగన్ పేరు పెట్టుకోవడం అలవాటైంది: ఎంపీ రఘురామకృష్ణరాజు - covid cases in ap
రాష్ట్రంలో కరోనా వేగంగా వ్యాప్తిస్తున్ననేపథ్యంలో యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రభుత్వాన్ని కోరారు. రకారకాల పేర్లతో పథకాలు తీసుకువస్తున్న ప్రభుత్వం...ఈ విషయంలోనూ జగనన్న కరోనా కేర్ లేదా మరేదైనా పేరు పెట్టి అమలు చేయాలని సూచించారు.
mp raghu rama krishnam raju