MP Raghu Rama Krishnam Raju:ఎంపీ పదవికి రాజీనామాపై చేయడంపై రఘురామకృష్ణరాజు మరోసారి స్పష్టతనిచ్చారు. ఫిబ్రవరి 5వ తేదీన రాజీనామా చేస్తానని చెప్పలేదన్నారు. తనపై అనర్హత వేటుకు.. తమ పార్టీ నేతలకు సమయమిచ్చానని వ్యాఖ్యానించారు. సరైన సమయంలో రాజీనామాపై నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు. సీఎం తన వల్ల కాదు.. రాజీనామా చేయమని అడిగితే చేస్తానని అన్నారు.
"అనర్హత వేసుకోవచ్చని ఈనెల 11 వరకు మా పార్టీ నేతలకు సమయమిచ్చా. సరైన సమయంలో నేను నిర్ణయం తీసుకుంటా. నేను 5వ తేదీనే రాజీనామా చేస్తానని చెప్పలేదు. సీఎం నావల్ల కాదు... రాజీనామా చేయమని అడిగితే చేస్తా. రాజీనామా ఎప్పుడు అనేది నేనే నిర్ణయిస్తా" - రఘురామకృష్ణరాజు, నర్సాపురం ఎంపీ