గవర్నర్ బిశ్వభూషణ్ చరిచందన్కు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు(Raghuramaraju) లేఖ రాశారు. జడ్జి రామకృష్ణ (judge Ramakrishna)ను పీలేరు జైలు నుంచి ఆస్పత్రికి తరలించాలని విజ్ఞప్తి చేశారు. జడ్జి రామకృష్ణ మధుమేహంతో బాధపడుతున్నారని లేఖలో వెల్లడించారు. తిరుపతిలో వసతులు ఉన్న ఆసుపత్రికి తరలించేలా చూడాలని గవర్నర్ను కోరారు. వైద్య పర్యవేక్షణ ఆలస్యమైతే ఇబ్బందికరమని రఘురామ వివరించారు. రాజ్యాంగ అధినేతగా పౌరుల హక్కులు పరిరక్షించాలని.. జడ్జి రామకృష్ణ కుమారుడి వినతి మేరకు లేఖ రాస్తున్నట్లు వెల్లడించారు.
RRR: 'జడ్జి రామకృష్ణను పీలేరు జైలు నుంచి ఆస్పత్రికి తరలించండి' - AP News
జడ్జి రామకృష్ణను పీలేరు జైలు నుంచి ఆస్పత్రికి తరలించాలని ఎంపీ రఘురామకృష్ణరాజు గవర్నర్కు లేఖ రాశారు. రాజ్యాంగ అధినేతగా పౌరుల హక్కులు పరిరక్షించాలని.. జడ్జి రామకృష్ణ కుమారుడి వినతి మేరకు లేఖ రాస్తున్నట్లు వెల్లడించారు.

ఎంపీ రఘురామకృష్ణరాజు గవర్నర్కు లేఖ