పార్టీకి, ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. దిల్లీలో కేంద్ర హోం మంత్రులను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తితిదే భూముల అమ్మకం సరికాదని మాత్రమే ప్రభుత్వానికి చెప్పానన్న రఘురామకృష్ణరాజు.. స్వామివారి భక్తుడిగా మాత్రమే నా అభిప్రాయాలు వెల్లడించానని అన్నారు.
తనపై కొద్దిరోజులుగా కొందరు బెదిరింపులకు దిగుతున్నారని ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. వీటిపై ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అన్నారు. షోకాజ్ నోటీసుపై న్యాయనిపుణులను సంప్రదిస్తున్నానని తెలిపారు. పార్టీపై పల్లెత్తు మాట అనలేదని.. అయినా వైకాపా సామాజిక మాధ్యమాల్లో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.