ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధానికి ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ - సీఎం జగన్​పై రఘరామ రాజు వ్యాఖ్యలు

ఏపీ కేడర్ ఐఏఎస్‌ల వార్షిక నివేదిక ఆమోదం సీఎం చేతుల్లో పెట్టడంపై ఎంపీ రఘురామకృష్ణరాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అంశంపై ప్రధాని మోదీకి ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వ జీవోపై జోక్యం చేసుకొని తగిన చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.

mp raghu ram krishna raju letter to pm modi
ప్రధానికి ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ

By

Published : Apr 16, 2021, 12:35 PM IST

ప్రధాని నరేంద్ర మోదీకి ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. ఏపీ కేడర్ ఐఏఎస్‌ల వార్షిక నివేదిక ఆమోదం సీఎం చేతుల్లో పెట్టడంపై ఫిర్యాదు చేశారు. ఐఏఎస్‌ల భవితవ్యం సీఎంగా ఉండే రాజకీయ నేతకు ఎలా అప్పగిస్తారని ఎంపీ ప్రశ్నించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోపై ఎంపీ రఘురామకృష్ణరాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిజాయితీపరులైన అధికారులకు అన్యాయం చేసే అవకాశముందని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ జీవోపై జోక్యం చేసుకొని తగిన చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details