ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

RRR LETTER: సీఎం జగన్​కు ఎంపీ రఘురామరాజు మరో లేఖ..ఈ సారి ఏంటంటే! - సీఎం జగన్​కు ఎంపీ రఘరామరాజు లేఖ

నర్సాపురం ఎంపీ రఘురామరాజు..సీఎం జగన్​కు నవ ప్రభుత్వ కర్తవ్యాల పేరుతో మరో లేఖ రాశారు. రాష్ట్రంలో జర్నలిస్టుల దుస్థితిని వివరిస్తూ వారికి ఇచ్చిన హామీని అమలు చేయాలని లేఖలో కోరారు.

సీఎం జగన్​కు ఎంపీ రఘరామరాజు లేఖ
సీఎం జగన్​కు ఎంపీ రఘరామరాజు లేఖ

By

Published : Jun 28, 2021, 8:20 AM IST

Updated : Jun 28, 2021, 4:40 PM IST

'నవ ప్రభుత్వ కర్తవ్యాల' పేరుతో సీఎం జగన్​కు 9వ లేఖ రాశారు నర్సాపురం ఎంపీ రఘురామరాజు. ఆంధ్రప్రదేశ్​లో జర్నలిస్టుల దుస్థితిని వివరిస్తూ.. వారికి ఇచ్చిన హామీని అమలు చేయాలని ఆయన లేఖలో కోరారు. మన మాటల్ని ప్రపంచానికి చెప్పే జర్నలిస్టుల బాధలను మీకు చెప్పేందుకు ఈ లేఖ రాస్తున్నట్లు తెలిపారు. మీరు తీసుకున్న ఒక నిర్ణయం తీవ్ర వివాదానికి కేంద్ర బిందువుగా మారిన విషయాన్ని గుర్తు చేస్తున్నట్లు లేఖలో స్పష్టం చేశారు.

జర్నలిస్టులకు ప్రభుత్వ గుర్తింపు ఇచ్చే అక్రిడిటేషన్‌ కమిటీలో ప్రభుత్వ ప్రతినిధులు, వివిధ మీడియా సంస్థల నుంచి జర్నలిస్టులు, జర్నలిస్టు యూనియన్ నాయకులు సభ్యులుగా ఉంటారన్న రఘురామ..మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన అక్రిడిటేషన్‌ కమిటీలో ఒక్క జర్నలిస్టు కూడా లేరని గుర్తుచేశారు. ఈ విషయంపై ఏ జర్నలిస్టు సంఘం కూడా మాట్లాడటం లేదంటే క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఏ ఒక్క సమావేశం జరుపుకోకుండానే ఆ కమిటీని రద్దు చేశారని..ఇది మరింత అశ్చర్యకరమైన విషయమని లేఖలో పేర్కొన్నారు.

కొత్త నిబంధనల కారణంగా చాలా మంది కార్డు పొందలేరన్న ఎంపీ..రెండేళ్లుగా జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయలేదని తెలిపారు. సుమారు 40 వేల దరఖాస్తులు సమాచార శాఖ వద్ద పడి ఉన్నాయని...17 వేల దరఖాస్తులు పరిశీలించి 470 కార్డులు జారీ చేశారని లేఖలో పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో జర్నలిస్టుల ఆరోగ్య భద్రతకు స్కీమ్ ఉండేదన్న రఘురామ..జర్నలిస్టులు రూ.1200 చెల్లిస్తే పటిష్ట ఆరోగ్యం కల్పించేదని వెల్లడించారు.

కరోనాతో మరణించిన జర్నలిస్టులకు ఇప్పటివరకు చెల్లింపులు జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్య శ్రీ కింద జర్నలిస్టులకు ఇప్పటివరకు సాయం చేయలేదని తెలిపారు. జర్నలిస్టులకు రూ. 50లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించాలన్న రఘురామ రాజు...జర్నలిస్టులను, మీడియా సిబ్బందిని ఫ్రంట్ లైన్ వారియర్స్​లో చేర్చాలని కోరారు. అక్రిడిటేషన్, ఆరోగ్య శ్రీ ఆరోగ్య కార్డుపై తక్షణమే నిర్ణయాలు తీసుకోవాలని లేఖలో ఎంపీ తెలిపారు.

ఇదీ చదవండి:

ఓటీటీ బాట పడుతోన్న టాలీవుడ్.. కారణమేంటో?

Last Updated : Jun 28, 2021, 4:40 PM IST

ABOUT THE AUTHOR

...view details