ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

MP RRR: రాజ్యాంగం ప్రకారం.. ఆ ఎన్నిక చెల్లదు: రఘురామ - వైకాపా శాశ్వత అధ్యక్షుడిగా జగన్​ ఎన్నికపై ఎంపీ రఘురామ కాంమెంట్స్

సీఈసీ రాజీవ్ కుమార్‌ను ఎంపీ రఘురామకృష్ణరాజు కలిశారు. ప్లీనరీలో విజయసాయి ప్రవేశపెట్టిన వైకాపా శాశ్వత అధ్యక్షుడి తీర్మానం అందలేదని ఎన్నికల అధికారి చెప్పారని ఎంపీ తెలిపారు. తీర్మానం అందాక ఈసీ నిర్ణయిస్తుందన్నారు. శాశ్వత అధ్యక్షుడి పదవి అశాశ్వతమని ఎంపీ రఘురామ అన్నారు.

MP RRR
MP RRR

By

Published : Jul 11, 2022, 5:42 PM IST

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్‌ను వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు కలిశారు. వైకాపా ప్లీనరీలో ఆ పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ తీర్మానంపై ఆయన చర్చించారు. విజయసాయి రెడ్డి తీర్మానం ఇంకా తనకు అందలేదని ఎన్నికల అధికారి చెప్పారని రఘురామ అన్నారు. తీర్మానం అందాక.. ఈసీ నిర్ణయిస్తుందన్నారు.

శాశ్వత అధ్యక్షుడి పదవి అశాశ్వతం. ఇది మా పార్టీకి ఒక సెట్ బ్యాక్. భయాలు పెట్టుకుని శాశ్వత అధ్యక్షుడు కావాలని జగన్‌ యోచిస్తున్నారు. కానీ రాజ్యాంగం ప్రకారం శాశ్వత అధ్యక్షుడి ఎన్నిక చెల్లదు. ఇప్పటివరకు ఇలాంటి కేసు ఈసీ ముందుకు రాలేదు. ఇదీ ఈసీ, రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం. - రఘురామకృష్ణరాజు , వైకాపా ఎంపీ

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details