'రెండు నిమిషాలు ఆగండి'.. మహారాష్ట్ర ఎంపీ తెలుగు పలుకులు - రెండు నిమిషాలు ఆగండి.. మహారాష్ట్ర ఎంపీ తెలుగు పలుకులు
అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ లోక్సభలో తెలుగులో ప్రసంగించి ఆశ్చర్యపర్చారు. జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లుపై చర్చ సందర్భంగా ఆమెకు అడ్డుతగిలిన తెలుగు ఎంపీలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జమ్ము కశ్మీర్ పునర్విభజన బిల్లుపై చర్చ సందర్భంగా లోక్సభలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న స్వతంత్ర ఎంపీ నవనీత్ కౌర్ విపక్ష సభ్యులకు ఝలక్ ఇచ్చారు. పున్వరిభజన బిల్లుపై కౌర్ మాట్లాడుతుండగా కొందరు తెలుగు ఎంపీలు అడ్డుతగిలారు. వెంటనే కౌర్ స్పందించి... 'రెండు నిమిషాలు ఆగండి, నేనూ స్వతంత్రంగా గెలిచాను, విపక్ష సభ్యురాలిని కానీ బిల్లుకు మద్దతిస్తున్నాను' అంటూ తెలుగులో కౌంటర్ ఇస్తూ... ప్రసంగాన్ని పూర్తి చేశారు.