తెదేపా అధినేత చంద్రబాబు దళితుల మధ్య చిచ్చు పెడుతున్నారని వైకాపా ఎంపీ నందిగం సురేష్ విమర్శించారు. కొందరూ మేధావులు దళితులపై దాడులు అంటూ చంద్రబాబు గొంతు వినిపిస్తున్నారని ఆరోపించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమమే ఏకైక అజెండాగా జగన్ పాలన సాగుతోందన్నారు. ఇప్పుడు మాట్లాడుతున్న దళిత మేధావులు... గత తెదేపా పాలనలో ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు దర్శకత్వంలో ఆత్మ వంచన చేసుకుని మాట్లాడొద్దని... ఆత్మపరిశీలన చేసుకుని మాట్లాడాలని సూచించారు. దళితుల్లో పుట్టి... దళితులను కించపరిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
దాడులంటూ ఆరోపిస్తున్నవారు అప్పుడు ఎక్కడ దాక్కున్నారు: నందిగం సురేష్ - చంద్రబాబుపై ఎంపీ సురేష్ మండిపాటు
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమమే ఏకైక అజెండాగా జగన్ పాలన సాగుతోందని వైకాపా ఎంపీ నందిగం సురేష్ అన్నారు. కొందరూ దళిత మేధావులు చంద్రబాబు దర్శకత్వంలో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. అలా మాట్లాడుతున్న వారు ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు.
mp nandigam suresh