అమరావతి రైతులకు బేడీలు వేశారని తెలిసిన మరుక్షణమే సీఎం వైఎస్ జగన్ బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకున్నారని వైకాపా ఎంపీ నందిగం సురేష్ అన్నారు. దళిత మేధావులు అని చెప్పుకునే కొంతమంది వ్యక్తులు చంద్రబాబు తొత్తులుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇదే రాజధాని ప్రాంతంలో చంద్రబాబు హయాంలో అసైన్డ్ భూములు అన్యాక్రాంతమైనప్పుడు వీరంతా ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. తెదేపా హయాంలో అనేకమంది దళితులు ఇబ్బందులు పడ్డారని అన్నారు. స్వయంగా తనను అరెస్ట్ చేసి 48 గంటలపాటు నానా హింసలు పెట్టినప్పుడు ఈ దళిత మేధావులంతా ఏమయ్యారని ప్రశ్నించారు.
'దళితులకు ఏ కష్టం వచ్చినా వైకాపా అండగా ఉంటుంది' - ఎంపీ నందిగం సురేష్ తాజా వార్తలు
అమరావతి రైతుల జీవితాలతో ఆడుకుంది చంద్రబాబేనని వైకాపా ఎంపీ నందిగం సురేష్ ఆరోపించారు. దళితులకు అండగా నిలిచేది ప్రభుత్వమని.. దళితులకు ఏ కష్టం వచ్చినా వైకాపా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
జగన్ సీఎం అయ్యాక దళితులకు, పేదలకు 54వేల ఇళ్ళ పట్టాలు ఇస్తామంటే అడ్డుకున్న వారంతా ఇప్పుడు నీతులు చెబుతున్నారని అన్నారు. దళితులకు అండగా నిలిచేది తమ ప్రభుత్వమేనని.. దళితులకు ఏ కష్టం వచ్చినా వైకాపా ప్రభుత్వం, నాయకులు అండగా ఉంటారన్నారు. అమరావతి రైతుల జీవితాలతో చంద్రబాబు ఆడుకున్నారని ఆరోపించారు. తప్పు ఎవరు చేసినా ఒకటేనని.. తమ ప్రభుత్వంలో ఎక్కడ అన్యాయం జరిగినా, దళితులపై దాడులు జరిగినా వెంటనే కేసులు పెడుతున్నారని అన్నారు.
ఇదీ చదవండి:'సీ-ప్లేన్'తో పర్యటక భారతానికి సరికొత్త కళ