ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ హద్దులు దాటి వ్యవహరిస్తున్నారని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణరావు ఆరోపించారు. స్ధానిక ఎన్నికలను వివాదాల సుడిగుండంలోకి నెడుతున్నారని మోపిదేవి అన్నారు. ఎస్ఈసీ తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే పిచ్చోడి చేతిలో రాయిలా ఉన్నాయని ఆరోపించారు. గుంటూరు, చిత్తూరు జిల్లాలో ఏకగ్రీవాలకు అడ్డుపడేలా హుకుం జారీ చెయ్యడం సరికాదన్నారు. ఆధిపత్య పోరు ఎక్కువగా ఉండేది స్థానిక ఎన్నికలలోనే అని...ఏకగ్రీవాల వల్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగవని తెలిపారు.
నిమ్మగడ్డ డీజీపీకి లేఖ రాయడం దారుణం: ఎంపీ మోపిదేవి
ఎస్ఈసీ శాంతియుతంగా జరుగుతున్న స్థానిక ఎన్నికలను వివాదాల సుడిగుండంలో నెడుతున్నారని ఎంపీ మోపిదేవి వెంకటరమణ ఆరోపించారు. ఏకగ్రీవాల వల్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగవని తెలిపారు.
పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ నిమ్మగడ్డ డీజీపీకి లేఖ రాయడం దారుణమన్నారు. గృహనిర్బంధం చెయ్యడం...మీడియా ముందుకు రావద్దు అనే అధికారం ఎస్ఈసీకి ఎవరిచ్చారని ప్రశ్నించారు. నిమ్మగడ్డ తీసుకుంటున్న నిర్ణయాలపై పెద్దిరెడ్డి స్పందించడం తప్పు కాదన్నారు. నిమ్మగడ్డ రిటైర్డ్ అయ్యాక చంద్రబాబుతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారని మోపిదేవి అన్నారు. ఎస్ఈసీ నిర్ణయాలతో రానున్న రోజుల్లో జరగనున్న ఎన్నికలు శాంతియుతంగా జరుగుతాయన్న నమ్మకం లేదన్నారు.
ఇదీ చదవండి: