ప్రస్తుత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ రేపు కచ్చితంగా పుంజుకుంటామని తెలుగుదేశం నేతలు ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు నిర్ణయించేది ప్రజలేనని వారి తీర్పును గౌరవిస్తామని విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలిపారు. ఎన్నికలలో పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ ట్విటర్ వేదికగా కృతజ్ఞతలు చెప్పారు.
ఓట్ల శాతం చెక్కుచెదరలేదు: గోరంట్ల
వైకాపా గెలిచింది నిజమే కానీ తెదేపా ఓడిన స్థానాల్లో చాలా తక్కువ మెజారిటీతో ఓడిందని పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. తెదేపా ఓటు షేర్ చెక్కు చెదరలేదనే విషయం మరోసారి నిరూపితం అయిందని చెప్పారు. అధికార అండ, ధన ప్రవాహంతో వచ్చిన తాత్కాలిక విజయం అనే విషయం తెలుసుకోవాలని హితవు పలికారు. ఈ విజయం కృతిమ ఆనందం పొందడానికి మాత్రమే పనికి వస్తుందని ఎద్దేవా చేశారు. అరాచకాలు తట్టుకుని నిలబడ్డ తెదేపా అభిమానులు, కార్యకర్తలు కృషి మరువలేనిదన్నారు.
ఇదీ చదవండి
పుర పోరు: కోటలో తగ్గని వైకాపా జోరు..మరోసారి విజయకేతనం