ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రానికి ప్రత్యేక రైల్వేజోన్ వచ్చేదెప్పుడు? - ఎంపీ కేశినేని - రాష్ట్రానికి ప్రత్యేక రైల్వే జోన్ పై ఎంపీ కేశినేని నాని

MP Nani On Railway Zone: రాష్ట్ర విభజన జరిగిన ఏడేళ్లయినా.. ఇప్పటికీ హామీలు నెరవేర్చలేదని లోక్‌సభలో తెలుగుదేశం ఎంపీ కేశినేని నాని ప్రశ్నించారు. స్వయంగా ప్రధాని హామీ ఇచ్చినా.. ప్రత్యేక రైల్వేజోన్‌ పనులు ఇప్పటికీ ప్రారంభించలేదని ఆయన నిలదీశారు.

MP Nani On Special Railway Zone
ఎంపీ కేశినేని నాని

By

Published : Mar 16, 2022, 1:25 PM IST

MP Nani In Loksabha on Special Railway Zone: రాష్ట్ర విభజన జరిగిన ఏడేళ్లయినా ఇప్పటికీ హామీలు నెరవేర్చలేదని లోక్‌సభలో తెలుగుదేశం ఎంపీ కేశినేని నాని ప్రశ్నించారు. స్వయంగా ప్రధాని హామీ ఇచ్చినా.. ప్రత్యేక రైల్వేజోన్‌ పనులు ఇప్పటికీ ప్రారంభించలేదని ఆయన నిలదీశారు. ఎప్పటిలోగా రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తారో ఖచ్చితమైన తేదీ ప్రకటించాలని కోరారు. దీనిపై స్పందించిన రైల్వేమంత్రి అశ్వని వైష్ణవ్‌, ఇప్పటికీ డీపీఆర్‌ సహా కీలక పనులు తుది దశలో ఉన్నాయని వీలైనంత త్వరగా పనులు చేపడతామని హామీ ఇచ్చారు.

రాష్ట్రానికి ప్రత్యేక రైల్వేజోన్ వచ్చేదెప్పుడు -ఎంపీ కేశినేని నాని

"రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక రైల్వేజోన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. విభజన చట్టంలోనూ ఈ విషయం పొందుపరిచారు. ఇప్పటి వరకు ఎలాంటి పనులూ ప్రారంభించలేదు. దక్షిణ కోస్తా రైల్వేజోన్ ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతుందని ప్రధాని మోదీ సైతం ప్రకటించారు. 2019 ఫిబ్రవరి 27న రైల్వేమంత్రి సైతం దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రకటన చేశారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు. పనులు ప్రారంభించకపోవడానికి కారణాలు తెలపడంతోపాటు.. ఎప్పటిలోగా ప్రారంభిస్తారన్నది ఖచ్చితమైన తేదీ ప్రకటించాలని రైల్వేమంత్రిని కోరుతున్నాను."- కేశినేని నాని, తెదేపా ఎంపీ

"దక్షిణ కోస్తా రైల్వేజోన్ వీలైనంత త్వరగా ఏర్పాటు చేసేందుకు కేంద్రం సుముఖంగా ఉంది. బిల్డింగ్ పనులు, స్థలసేకరణ, డీపీఆర్‌ అన్నీ చివరి దశలో ఉన్నాయి. జోన్‌ ఏర్పాటుకు మేం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉన్నాం. వీలైనంత త్వరగా ప్రత్యేక రైల్వేజోన్ ఏర్పాటు చేస్తాం." -అశ్వని వైష్ణవ్‌, రైల్వేమంత్రి

ఇదీ చదవండి :నాటుసారా మరణాలపై నిలదీస్తే.. సభ నుంచి సస్పెండ్ చేశారు -తెదేపా

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details