కృష్ణా జిల్లా కలెక్టర్ పేరుతో ఉన్న ట్విటర్ ఖాతాలో.. రాజకీయ విమర్శలు ఉండటాన్ని విజయవాడ ఎంపీ కేశినేని నాని తప్పుబట్టారు. "చంద్రబాబులా బడాబాబులు, కాంట్రాక్టర్ల వెంట పరుగెత్తకుండా జగన్మోహన్ రెడ్డి రైతులు, పేదల బతుకులు మారుస్తున్నారు" అని అవనిగడ్డ ఎమ్మెల్యే చేసిన రాజకీయ వ్యాఖ్యలను కృష్ణా కలెక్టర్ ట్వీట్ చేశారు.
కలెక్టర్.. తానొక ప్రభుత్వ అధికారి అని గుర్తుంచుకోవాలని ఎంపీ నాని హితవు పలికారు. ఒక మాజీ ముఖ్యమంత్రి మీద ఒక శాసనసభ్యుడు చేసిన విమర్శను కలెక్టర్ ట్వీట్ చేయడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. కలెక్టర్ తప్పును వెంటనే సరిదిద్దుకోవాలని డిమాండ్ చేశారు.