జగన్ పాలనలో విజయవాడలో గంజాయి విక్రయాలు అధికం అయ్యాయని ఎంపీ కేశినేని నాని(mp kesineni nani) ఆరోపించారు. విజయవాడలో సీసీ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేది లేకుండా పోయాయని కేశినేని వ్యాఖ్యానించారు. అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని ఎంపీ మండిపడ్డారు.
Kesineni: రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్కడ ఉన్నాయి..? - CC road paving in Vijayawada
జగన్ పాలనలో విజయవాడ నగరం అక్రమాలకు అడ్డాగా మారిందని ఎంపీ కేశినేని(kesineni) నాని విమర్శించారు. పోలీసులు తెదేపా నేతలపై కేసులు పెడుతూ.. వైకాపా నేతలకు రాచబాట వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
![Kesineni: రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్కడ ఉన్నాయి..? MP Keshineni Nani](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12872452-897-12872452-1629886643211.jpg)
ఎంపీ కేశినేని నాని