రాజధానికి లక్ష కోట్లు పైబడి నిధులు అవసరం లేదని ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ పేర్కొన్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా ఎలా అభివృద్ధి చేయొచ్చో మాస్టర్ ప్లాన్‌లోనే ఉన్నాయని వివరించారు. అమరావతిలో 53 వేల ఎకరాల ద్వారా సంపద సృష్టి ఎలా సాధ్యమో తెలుసుకుంటే చాలని హితవుపలికారు. ఏకాభిప్రాయం తీసుకున్నాకే అమరావతిలో రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుట్టారని స్పష్టం చేశారు.
'రాజధానికి లక్ష కోట్ల నిధులు అవసరం లేదు' - tdp on amaravathi finanace
అధికారంలోకి రాగానే సీఎం జగన్ తన వైఖరి మార్చారని తెదేపా ఎంపీ కనకమేడల ఆరోపించారు. రాజధాని నిర్మాణానికి అధికార పార్టీ నేతలు చెబుతున్నట్లు లక్ష కోట్లు పైబడి నిధులు అవసరం లేదన్నారు.
అమరావతి నిధులపై కనకమేడల