ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సజ్జల వ్యాఖ్యలు ఆవేదనకు గురిచేశాయి: కనకమేడల - కనకమేడల తాజా వార్తలు

వైకాపా ప్రభుత్వంపై తెదేపా ఎంపీ కనకమేడల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలనలో దేవాలయాలపై దాడులు పెరిగాయన్న కనకమేడల... 147 ఘటనలపై వైకాపా ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

mp-kanakamedala-comments-on-ycp
ఎంపీ కనకమేడల

By

Published : Jan 30, 2021, 6:33 PM IST

వైకాపా అధికారంలోకి వచ్చాక విగ్రహాలపై దాడులు పెరిగాయని ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపించారు. వైకాపా విధానాలతో భయానక వాతావరణం పెరిగిందన్నారు. జగన్ పాలనలోనే ఎందుకు దాడులు జరుగుతున్నాయని కనకమేడల ప్రశ్నించారు. నిర్లిప్తత వల్లే దేవాలయాలపై దాడులు పెరిగాయని విమర్శించారు. 147 ఘటనలపై వైకాపా ప్రభుత్వం జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు.

అఖిలపక్ష భేటీలో వైకాపా నేతలు ఏమీ అడగలేదన్న కనకమేడల... అఖిలపక్ష భేటీనీ ఎందుకు తప్పుదారి పట్టిస్తున్నారని నిలదీశారు. వైకాపా నేతలు బయటకు వచ్చి అబద్ధాలు చెబుతున్నారని కనకమేడల మండిపడ్డారు. తెదేపాపై బురదజల్లాలనే ఆలోచన తప్ప మరేం లేదా అని ప్రశ్నించారు. సజ్జల వ్యాఖ్యలు విని చాలా ఆవేదన చెందానన్న కనకమేడల... అమరావతి మహిళలపై అనేక దాడులు చేశారన్నారు.

ABOUT THE AUTHOR

...view details