అరకు ఎంపీ గొడ్డేటి మాధవి... నాగలి పట్టారు. కొయ్యూరు మండలంలోని తన స్వగ్రామం శరభన్నపాలెంలో ఉన్న వ్యవసాయక్షేత్రంలో వ్యవసాయ పనులు చేశారు. నాగలి పట్టి కొద్దిసేపు పొలం దున్నారు. సేంద్రియ కూరగాయల క్షేత్రంలో సాగు పనులను పరిశీలించారు. క్షేత్రంలోని కూలీలతో కొద్దిసేపు ముచ్చటించారు. ఎంపీ అయిన తరువాత మళ్లీ వ్యవసాయ పనుల్లో నిమగ్నం కావటం సంతోషంగా ఉందన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రతిఒక్కరూ భౌతికదూరం పాటించాలని సూచించారు.
పొలం పనుల్లో అరకు ఎంపీ గొడ్డేటి మాధవి - ycp mp goddeti madhavi
విశాఖలోని కొయ్యూరు మండలం శరభన్నపాలెం గ్రామంలోని వ్యవసాయక్షేత్రంలో అరకు ఎంపీ గొడ్డేటి మాధవి నాగలి పట్టి పొలం దున్నారు.
mp goddeti madhavi