ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'పునర్విభజనతోనే జమ్ము కశ్మీర్ అభివృద్ధి' - "పునర్విభజనతోనే జమ్ముకశ్మీర్ అభివృద్ధి"

జమ్ము కశ్మీర్ పునర్విభజన బిల్లుకు లోక్​సభలో తెదేపా మద్దతు పలికింది. ఈ బిల్లు జమ్ము కశ్మీర్ అభివృద్ధికి, ప్రగతికి మార్గం సుగమం చేస్తుందని ఆ పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ తెలిపారు.

"పునర్విభజనతోనే జమ్ముకశ్మీర్ అభివృద్ధి:ఎంపీ గల్లా

By

Published : Aug 6, 2019, 4:49 PM IST

"పునర్విభజనతోనే జమ్ముకశ్మీర్ అభివృద్ధి:ఎంపీ గల్లా
జమ్ము కశ్మీర్ పునర్విభజన బిల్లుకు తెదేపా మద్దతిస్తున్నట్లు ఆ పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ లోక్​సభలో తెలిపారు. బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడిన ఆయన.. మా పార్టీ అధినేత చంద్రబాబు సంపూర్ణ మద్దతు ప్రకటించారని అన్నారు. ఈ బిల్లు జమ్ము కశ్మీర్ ప్రగతికి మార్గం సుగమం చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటివరకు జమ్ముకశ్మీర్ అభివృద్ధికి వేల కోట్లు ఖర్చు చేశారు..అయినా అక్కడ ఉగ్రవాదం తప్ప ఎలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు. ఆ రాష్ట్ర అభివృద్ధికి మార్గసూచి ప్రకారం కేంద్రం ముందుకెళ్లాలని పేర్కొన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details