ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎంపీకే ఇలా ఉంటే..సామాన్యుల పరిస్థితేంటి..? - అమరావతి కోసం చలో అసెంబ్లీ వార్తలు

అరెస్ట్​కు ముందు కనీసం విధి విధానాలు పాటించకుండా పోలీసులు వ్యవహరించారని తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. రాష్ట్రం ఒక పోలీసు రాజ్యంగా మారిందని ఆరోపించారు.

MP galla jayadev reaction on his arrest over chalo assembly
MP galla jayadev reaction on his arrest over chalo assembly

By

Published : Jan 21, 2020, 7:29 PM IST

తెదేపా ఎంపీ గల్లా జయదేవ్
రాష్ట్రం పోలీసు రాజ్యంగా మారిందని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఆరోపించారు. అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో భాగంగా అరెస్టయి గుంటూరు సబ్ జైలులో ఉన్న ఆయన విడుదలయ్యారు. తన అరెస్ట్​పై స్పందించిన ఆయన...రాజధాని ఉద్యమాన్ని మరో స్వాతంత్య్ర పోరాటంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఓ ఎంపీ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుబట్టారు. అరెస్ట్​కు ముందు పోలీసులు కనీసం విధి విధానాలు పాటించలేదన్నారు. నేరస్థులు, ఉగ్రవాదుల మాదిరిగా కనీస సమాచారం ఇవ్వకుండా అరెస్ట్ చేస్తారా ? అని నిలదీశారు. మూడు రాజధానులు రాష్ట్రానికి గుదిబండన్న జయదేవ్...శాససనభలో ఆమోదిస్తే అయిపోయినట్లు కాదన్నారు. రాజధాని సమస్య పై కేంద్రం స్పందిస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details