ఏపీ రాజధాని అమరావతిని అభివృద్ధి చేయాలని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ లోక్ సభలో డిమాండ్ చేశారు. అమరావతిని అభివృద్ధి చేయాలని హైకోర్టు ఆదేశించినా.. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని అన్నారు. రాజ్యాంగాన్ని అతిక్రమించి.. చట్టాలు చేసే అధికారం అసెంబ్లీ, పార్లమెంట్‌కు లేదన్నారు. అదే విధంగా కేంద్ర బడ్జెట్‌లో అమరావతికి సరిపడా నిధులు కేటాయించలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు.
'అమరావతిని అభివృద్ధి చేసేలా కేంద్ర సహకరించాలి'.. లోక్ సభలో ఎంపీ గల్లా
MP Galla Jayadev on Amaravati: కేంద్ర బడ్జెట్‌లో అమరావతికి సరిపడా నిధులు కేటాయించలేదని లోక్ సభలో ఎంపీ గల్లా జయదేవ్ అసహనం వ్యక్తం చేశారు. అమరావతిని అభివృద్ధి చేసేలా కేంద్రం సహకరించాలని సభలో విన్నవించారు. అమరాతి రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని న్యాయస్థానం ఆదేశించినా.. ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్నారు.
శాసనవ్యవస్థ కంటే కూడా రాజ్యాంగం ఎంతో అత్యుత్తమైనది. ఏపీ రాజధాని అమరావతి అని ఇప్పటికే హైకోర్టు స్పష్టం చేసింది. సీఆర్డీఏ చట్టం, మాస్టర్ ప్లాన్ ప్రకారం.. అమరాతిని, రాజధాని ప్రాంతాన్ని ఆరు నెలల్లోపు అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ ప్రభుత్వం ఏ ఒక్క పనిని మొదలుపెట్టలేదు. అదే విధంగా కేంద్ర బడ్జెట్‌లో అమరావతికి సరిపడా నిధులు కేటాయించకపోవడం నిరాశపరిచింది. ఇప్పటికైనా అమరావతికి సరిపడా నిధులు కేటాయించి అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నా.- గల్లా జయదేవ్, ఎంపీ
ఇదీ చదవండి:Oppositions: "వికేంద్రీకరణతో.. విద్వేష రాజకీయాలు చేస్తున్నారు"