విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై పునరాలోచించాలని కోరుతూ..కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్లకు ఎంపీ గల్లా జయదేవ్ లేఖలు రాశారు. ఆర్థిక మందగమన వేళ ఇలాంటి నిర్ణయాలు సరికాదన్నారు. పెట్టుబడుల ఉపసంహరణ ఆర్థికరంగానికి మంచిది కాదన్న గల్లా....ప్రైవేటుపరం చేసే బదులు ప్రత్యేక గనులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. స్టీల్‌ప్లాంట్ రుణాలను ఈక్విటీగా, ప్రాధాన్యత షేర్లుగా మార్చాలన్నారు. ఉక్కు పరిశ్రమను అప్పులఊబి నుంచి రక్షించాలని గల్లా కోరారు.
కేంద్రమంత్రులకు ఎంపీ గల్లా లేఖ...విశాఖ ఉక్కుపై పునరాలోచించాలని విజ్ఞప్తి - విశాఖ ఉక్కుపై కేంద్రమంత్రులకు గల్లా లేఖ
విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణపై పునరాలోచించాలని ఎంపీ గల్లా జయదేవ్ కోరారు. దీనిపై కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్లకు లేఖలు రాశారు.
MP Galla jayadev
TAGGED:
ఎంపీ గల్లా జయదేవ్ వార్తలు