కొవిడ్ యోధులైన డాక్టర్లు, నర్సులు, ఇతరులను ప్రభుత్వం వేధించిందని తెదేపా పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్ ఉదాహరించారు. కరోనా కాలం వలస కూలీలది అత్యంత విషాదగాథని, ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని జయదేవ్ అభిప్రాయపడ్డారు. రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీలో అంశాలన్నీ సరఫరా వ్యవస్థ సమస్యలపైనే ఉన్నాయి తప్ప డిమాండ్ అంశాలపై దృష్టి పెట్టలేదన్నారు.
కఠినమైన పాఠాలు నేర్చుకోవాలి
ఇదే అంశంపై వైకాపా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ కరోనా మహమ్మారి నేపథ్యంలో కఠినమైన పాఠాలు నేర్చుకోవాలని, చాలా అంశాలపై ఆత్మ పరిశీలన చేసుకోవాలని అన్నారు. ప్రజలకు ప్రాథమిక ఆరోగ్యం లభ్యత, రేషన్ పంపిణీ, వలస కార్మికుల అంశం, పిల్లల్లో రోగనిరోధకత పెంపు, మధ్యాహ్న భోజనం అందజేత, పిల్లలను తిరిగి పాఠశాలలకు రప్పించే అంశాలపై దృష్టి పెట్టాలన్నారు.
ఇదీ చదవండి:రాజధానికి సంబంధించిన పిటీషన్లపై ఇవాళ హైకోర్టులో విచారణ