తెలంగాణలో ఎన్‌పీఆర్‌ను అమలు చేయొద్దని కేసీఆర్‌కు అసదుద్దీన్ విజ్ఞప్తి చేశారు. ఎంఐఎం 62వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ జెండాను అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆవిష్కరించారు. ప్రాణం ఉన్నంత వరకు గళం వినిపిస్తానని స్పష్టం చేశారు. విద్వేష ఉపన్యాసాలు చేస్తున్నానని కేసులు పెట్టినా భయపడబోనని పేర్కొన్నారు.
దిల్లీ అల్లర్లపై మోదీ ఎందుకు మాట్లాడడం లేదు: అసదుద్దీన్ - mp asaduddin allegation on modi over delhi roits
తెలంగాణలో ఎన్పీఆర్ అమలు చేయొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎంపీ అసదుద్దీన్ విజ్ఞప్తి చేశారు. ఎంఐఎం 62వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. దిల్లీ అల్లర్లపై మోదీ ఎందుకు మాట్లాడడం లేదని అసదుద్దీన్ నిలదీశారు.
![దిల్లీ అల్లర్లపై మోదీ ఎందుకు మాట్లాడడం లేదు: అసదుద్దీన్ MIM's 62nd Anniversary Day](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6256076-181-6256076-1583052290590.jpg)
ఘనంగా ఎంఐఎం 62వ ఆవిర్భావ దినోత్సవం
అసదుద్దీన్ ఓవైసీ ప్రసంగం
2020 ఏడాదిలో దిల్లీ మరో మారణహోమానికి వేదికయ్యిందని అసదుద్దీన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత విధ్వంసం జరిగినా ప్రధాని ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. గుజరాత్ అల్లర్ల నుంచి మోదీ పాఠాలు నేర్చుకుని ఉంటారనుకున్నానని ఘాటుగా వ్యాఖ్యానించారు. చనిపోయిన వారంతా భారతీయులేనని పేర్కొన్నారు. బాధితులకు ఎంఐఎం ప్రజాప్రతినిధులు ఒకనెల జీతం విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు.
ఇవీచూడండి:దిల్లీలో అల్లర్లకు కారణమదే: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి