ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తీరు మార్చుకోకపోతే తెలంగాణలో రాష్ట్రపతి పాలన: ఎంపీ అర్వింద్ - mp arvind about new agriculture act

కడుపు కాలితే రైతులే ధర్నా చేస్తారు.. జిల్లాకో మంత్రిని నియమించి ధర్నా చేయించడమేంటని ముఖ్యమంత్రి కేసీఆర్​పై భాజపా ఎంపీ అర్వింద్ మండిపడ్డారు. ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే త్వరలోనే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వస్తుందని హెచ్చరించారు. రాష్ట్ర హోంమంత్రే ధర్నాలో పాల్గొంటే.. శాంతి భద్రతల సమస్య రాదా అని ప్రశ్నించారు.

mp arvind fires on telangana government
తీరు మార్చుకోకపోతే తెలంగాణలో రాష్ట్రపతి పాలన: ఎంపీ అర్వింద్

By

Published : Dec 8, 2020, 2:43 PM IST

రైతు నిర్వచనమే మార్చేసిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు రైతుల గురించి మాట్లాడుతున్నారు. ధర్నా చౌక్​ను ఎత్తేసిన కేసీఆర్.. ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారు. దిల్లీలో రోడ్డెక్కింది దళారులు. ఏజెంట్​ కమిషన్ల ఉద్యమానికి కేసీఆర్ మద్దతు పలుకుతున్నారు. కార్పొరేట్ వద్దని పోరాటం చేస్తున్న సీఎం.. ఫామ్​హౌజ్​లో కార్పొరేట్ వ్యవసాయం చేస్తున్నారు. ఎర్రజొన్న, పసుపు రైతులు రోడ్డెక్కితే.. ఫామ్​హౌజ్​లో ఉన్న కేసీఆర్.. హరియాణా, పంజాబ్​ బ్రోకర్ల ఉద్యమంలో పాల్గొంటున్నారు.

భాజపా ఎంపీ అర్వింద్

తీరు మార్చుకోకపోతే తెలంగాణలో రాష్ట్రపతి పాలన: ఎంపీ అర్వింద్

సీఎం కేసీఆర్​కు రైతులపై ప్రేమ ఉంటే రిజిస్ట్రేషన్లు ఉచితం చేయాలని భాజపా ఎంపీ అర్వింద్ డిమాండ్ చేశారు. శీతల గిడ్డంగులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులకు కార్పొరేట్లు కనీస మౌలిక సదుపాయాలు కల్పిస్తే తప్పేంటని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో ఉద్యమం అంటే ఏంటో కేసీఆర్ చూస్తారని అర్వింద్ అన్నారు.

కొత్త చట్టం ప్రకారం ఉత్పత్తులను రైతు పొలం దగ్గరికి వచ్చి కొనుగోలు చేస్తారని అర్వింద్ స్పష్టం చేశారు. మార్కెట్ యార్డుల్లో, ఏజెంట్ల ద్వారానే అమ్మాలని రైతులకు సంకెళ్లు వేశారని విమర్శించారు. మోదీ ప్రతి ఆరు నెలలకోసారి కనీస మద్దతు ధర పెంచుతున్నారని తెలిపారు. వ్యవసాయ చట్టాలపై చర్చకు తాను సిద్ధమని.. తెరాస నేతలు సిద్ధమా అని సవాల్ విసిరారు.

ఇదీ చూడండి :

బాధితుల రక్త నమూనాల్లో సీసం గుర్తింపు..: ఏలూరు ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్

ABOUT THE AUTHOR

...view details