భాష నశిస్తే జాతి నశిస్తుంది తెలుగు భాషను భావితరాలకు అందించాల్సిన బాధ్యత తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని తెలుగు అధికార భాషాసంఘం మాజీ అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానంలో ప్రాధమిక విద్య , సాంకేతిక విద్యను మాతృభాషలో బోధన చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వడం పై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
భారత దేశంలోనే భాషా ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నారు. ప్రతి ఇంట్లో తల్లి తండ్రులు పిల్లలను తెలుగులోనే మాట్లాడే విధంగా చర్యలు చేపట్ట వలసిన అవసరం ఉన్నదన్నారు. బహు భాషలు నేర్చుకోవాలి కానీ ప్రాధమిక విద్యా బోధన మాతృ భాషలో జరగాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లీష్ మాధ్యమంలో విద్యా బోధన చేయుటకు ఆశక్తి చూపిస్తోందని అన్నారు.