శాసనమండలి ఛైర్మన్‌గా కొయ్యె మోషేను రాజు ఎన్నిక ఖరారైంది. గురువారం సాయంత్రం ఛైర్మన్ పదవికి వైకాపా తరఫున ఆయన నామినేషన్ దాఖలు చేశారు. మరెవరూ పోటీలో లేకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. శుక్రవారం మధ్యాహ్నం 2:30 గంటలకు మండలిలో ప్రొటెం ఛైర్మన్ బాలసుబ్రమణ్యం మోషేను రాజు ఛైర్మన్‌గా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించనున్నారు.
అంతకుముందు ఇదే విషయమై మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడితో శాసన వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రత్యేకంగా చర్చించారు. తెదేపా నుంచి పోటీకి దిగే విషయమై ఆరా తీసినట్లు సమాచారం. తాము అభ్యర్థిని పోటీ పెట్టబోమని యనమల చెప్పినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే సాయంత్రం వైకాపా అభ్యర్థి మోషేను రాజు నామినేషన్ దాఖలు చేశారు. డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక విషయంలో ఇంకా స్పష్టత రాలేదు.