తెలంగాణలో బ్యాంకర్లపై కరోనా ప్రభావం రోజు రోజుకు తీవ్రమవుతోంది. 3 వేల మందికిపైగా ఉద్యోగులు కరోనా బారిన పడగా.. ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఖాతాదారులతో నేరుగా సంబంధాలు కలిగిన ఉద్యోగులు.. ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా కరోనాకు గురవుతున్నారు. ఈనెల ఒకటి నుంచి ఇప్పటి వరకూ రాష్ట్రంలో అన్ని బ్యాంకులకు చెందిన 3,238 మంది ఉద్యోగులకు కరోనా సోకింది. అత్యధిక బ్రాంచ్లు కలిగిన ఎస్బీఐ ఉద్యోగులే 1,028మంది కరోనా బారిన పడ్డారు.
రాష్ట్ర వ్యాప్తంగా 3వేల మందికి పైగా బ్యాంకు ఉద్యోగులకు కరోనా - bank employees affected with coronavirus in telangana
తెలంగాణలో కరోనా విలయతాండవం చేస్తోంది. అన్ని రంగాల వారిపై మహమ్మారి తన పంజా విసురుతోంది. రాష్ట్రంలో బ్యాంకర్లపై కొవిడ్ ప్రభావం రోజురోజుకు తీవ్రతరమవుతోంది. 3వేల మందికిపైగా బ్యాంక్ ఉద్యోగులకు మహమ్మారి సోకింది.
కరోనా ఉద్ధృతిని దృష్టిలో పెట్టుకొని.. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం బ్యాంకు పనివేళల్లో మార్పులు చేయాలని..రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే.. ఖాతాదారులకు సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరింది. మరోవైపు.. కరోనా బారిన పడుతున్న తమ ఉద్యోగులకు అండగా ఉండేలా.. కొన్ని బ్యాంకులు చర్యలు తీసుకొంటున్నాయి. డిజిటిల్ లావాదేవీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఖాతాదారులకు విజ్ఞప్తి చేస్తున్నాయి. కరోనా బారిన పడే తమ ఉద్యోగులకు పడకలు దొరక్కపోతే ప్రత్యామ్నాయంగా చికిత్స అందించేందుకు సికింద్రాబాద్లోని శిక్షణాశాలను తాత్కాలిక ఆస్పత్రిగా మార్చాలని ఎస్బీఐ నిర్ణయించింది.
ఇదీ చదవండి :విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో విషాదం.. ఇద్దరు కొవిడ్ రోగులు మృతి