సరైన ఆహారం, జీవన విధానంతో గుండెజబ్బులను కొంతవరకు తగ్గించ వచ్చని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. హృదయ ఫౌండేషన్ పదిహేనేళ్లలో 5008 ఉచిత శస్త్రచికిత్సలు పూర్తి చేసిన సందర్భంగా హైదరాబాద్ దస్పల్లా హోటల్లో నిర్వహించిన కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హృదయ ఫౌండేషన్ నిరుపేద చిన్నారుల్లో వచ్చే గుండె జబ్బులకు ఉచితంగా శస్త్రచికిత్సలను అందించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఈ ఫౌండేషన్ ద్వారా చిన్నారులకు పునరుజ్జీవం ఇస్తున్న నిర్వహకులకు ఉపరాష్ట్రపతి అభినందనలు తెలిపారు.
'హృదయ ఫౌండేషన్ సేవలు ప్రశంసనీయం' - hrudaya foundation visit vice president venkaiah naidu
స్వచ్ఛందంగా సమాజ సేవ చేస్తున్న వ్యక్తులు, సంస్థలను గుర్తించి అభినందించాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. తెలంగాణ హైదరాబాద్లోని హృదయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా 5008 శస్త్రచికిత్సలు పూర్తి చేసినందకు సంస్థ ప్రతినిధులను ఉపరాష్ట్రపతి అభినందించారు.
వెంకయ్య నాయుడు
ఈ కార్యక్రమంలో హృదయ ఫౌండేషన్ నిర్వాహకులు డాక్టర్ గోపిచంద్తోపాటు ఫౌండేషన్ ద్వారా ఉచితంగా గుండె శస్త్ర చికిత్సలు చేయించుకున్న చిన్నారులు వారి తల్లిదండ్రులు సైతం హాజరయ్యారు.
ఇదీ చూడండి : రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీలు పెంపు
TAGGED:
తెలంగాణ వార్తలు