ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో మరో 1322 మందికి కరోనా.. 20 వేలు దాటిన బాధితులు - ఏపీ కొవిడ్ వార్తలు

రాష్ట్రంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ఇవాళ తాజాగా 1,322 మందికి కోవిడ్‌ సోకినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో కలపి 20 వేల 19 మంది కరోనా బారినపడ్డారు. బాధితుల్లో 1,263 మంది రాష్ట్రవాసులు ఉండగా...ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 56 మంది, విదేశాల నుంచి వచ్చిన ముగ్గురికి కరోనా ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో కరోనాతో మరో ఏడుగురు మృతి చెందారు.

Carona Bulletin
Carona Bulletin

By

Published : Jul 6, 2020, 5:01 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. వైరస్ బారిన పడిన వారి సంఖ్య 20 వేలు దాటింది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,322 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తంగా బాధితుల సంఖ్య 20,019కి చేరింది. ఇందులో 17,365 మంది రాష్ట్రానికి చెందినవారు. 2,235 మంది ఇతర రాష్ట్రాలవారు. 419 మంది ఇతర దేశాల నుంచి వచ్చినవారు. ఈ రోజు నమోదైన కేసుల్లో రాష్ట్రానికి చెందినవారు 1,263 మందికాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు 56 మంది. ఇక ఇతర దేశాల నుంచి వచ్చినవారు ముగ్గురు ఉన్నారు.

రాష్ట్రంలో 20 వేలు దాటిన కరోనా పాజిటివ్‌ కేసులు

మరో ఏడుగురు మృతి

గత 24 గంటల్లో రాష్ట్రంలో 16,712 శాంపిల్స్‌ పరీక్షించారు. ఇప్పటివరకు 10,33,852 శాంపిల్స్‌ పరీక్షించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10,860 యాక్టివ్‌ కేసులున్నాయి. అలాగే ఇప్పటివరకు 8,920 మంది కోలుకుని డిశ్ఛార్జి అయ్యారు. వీరిలో ఈ రోజు డిశ్ఛార్జి అయినవారు 424 మంది. కొవిడ్‌తో ఇప్పటివరకు రాష్ట్రంలో 239 మంది చనిపోయారు. గత 24 గంటల్లో ఏడుగురు మరణించారు. శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు, అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కృష్ణా, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు కరోనాతో మృతి చెందారు.

జిల్లాల వారీగా...

కొత్తగా గుంటూరులో 197, తూర్పుగోదావరి జిల్లాలో 171, అనంతపురంలో 142, కర్నూలులో 136, చిత్తూరులో 120, పశ్చిమగోదావరి జిల్లాలో 106, విశాఖ జిల్లాలో 101, కడప జిల్లాలో 96, కృష్ణా జిల్లాలో 55, నెల్లూరులో 41, ప్రకాశం జిల్లాలో 38 , శ్రీకాకుళంలో 36, విజయనగరంలో 24 కరోనా కేసులు నమోదు అయ్యాయి.

ఇవీ చదవండి:ఇవీ చదవండి:

దేశవ్యాప్తంగా 'కోటి' దాటిన కరోనా పరీక్షలుదేశవ్యాప్తంగా 'కోటి' దాటిన కరోనా పరీక్షలు

ABOUT THE AUTHOR

...view details