ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

KANNABABU: ప్రజారోగ్యానికి మేలు కలిగేలా మరిన్ని పరిశోధనలు జరగాలి: కన్నబాబు - AP News

ప్రజారోగ్యానికి మేలు కలిగేలా ఉద్యాన విశ్వవిద్యాలయం మరిన్ని పరిశోధనలు, ఆవిష్కరణలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కె.కన్నబాబు వ్యాఖ్యానించారు. రైతులకు ప్రయోజనం కలిగించేలా ప్రకృతి సేద్యాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రయత్నించాలని స్పష్టం చేశారు. రసాయన, పురుగుమందుల వాడకాన్ని తగ్గించేలా రైతులకు అవగాహన కల్పించాల్సిందిగా సూచించారు.

వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం పంచాంగాన్ని ఆవిష్కరించిన వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు
వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం పంచాంగాన్ని ఆవిష్కరించిన వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు

By

Published : Jun 11, 2021, 8:01 PM IST

వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం పంచాంగాన్ని ఆవిష్కరించిన వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు... 98 ఉద్యాన పంటల సమాచారంతో రైతులకు సులువుగా అవగాహన కలిగేలా రూపొందించారని అధికారులను అభినందించారు. ఉద్యాన పంచాంగ పుస్తకాలు ప్రతీ రైతు భరోసా కేంద్రంలో ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉద్యాన సాగులో ఆరోగ్యానికి మరింతగా ఉపకరించే కొత్త పంటలను ప్రోత్సహించాలన్నారు. పురుగుమందులు, రసాయనాల వినియోగం తగ్గిస్తూ అధిక దిగుబడి ఇచ్చేలా పరిశోధనలు, ఆవిష్కరణలు జరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఏపీ ఉద్యాన పంటల ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉందని మంత్రి వ్యాఖ్యానించారు.

ABOUT THE AUTHOR

...view details