రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 54,455 నమూనాలను పరీక్షించగా 1,413 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 19,83,721కి చేరింది. తాజాగా 18 మంది కరోనా మహమ్మారికి బలవ్వగా.. మొత్తం మృతుల సంఖ్య 13,549కి పెరిగింది. మరోవైపు.. 1,795 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్ఛార్జి కాగా.. రాష్ట్రంలో ప్రస్తుతం 19,549 క్రియాశీల కేసులు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
AP Corona: రాష్ట్రంలో కొత్తగా 1,413 కేసులు.. 18 మరణాలు - రాష్ట్రంలో కరోనా కేసులు
రాష్ట్రంలో కొత్తగా 1,413 కేసులు
16:35 August 09
రాష్ట్రంలో నేటి కరోనా కేసుల వివరాలు
ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,52,47,884 నమూనాలను పరీక్షించినట్లు అందులో పేర్కొంది. తాజాగా చిత్తూరులో ఐదుగురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చదవండి:
Last Updated : Aug 9, 2021, 5:49 PM IST