పాక్ నుంచి విడుదల కానున్న 20 మంది మత్స్యకారులను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు మంత్రి మోపిదేవి వెంకటరమణ గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరారు. నేడు వాఘా సరిహద్దులో ఇరు దేశాలు పత్రాలు మార్చుకున్న అనంతరం మత్స్యకారులను భారత్కు అప్పగిస్తారు. అనంతరం వారిని మంత్రి రాష్ట్రానికి తీసుకొస్తారు.ఏడాది క్రితం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలానికి చెందిన 20 మంది మత్స్యకారులు చేపల వేట కోసం వెళ్లారు. గుజరాత్ తీరం వద్ద పాక్ జలాల్లోకి పొరపాటున ప్రవేశించడం వల్ల... పాకిస్థాన్ అధికారులు వారిని అరెస్టు చేశారు.పాకిస్థాన్లో ఉన్న భారత మత్స్యకారులను కరాచీ కారాగారం నుంచి వాఘాకు తరలిస్తున్నారు.
'వాఘా'కు పయనమైన మంత్రి మోపిదేవి
గుజరాత్ తీరం వద్ద పాక్ జలాల్లోకి ప్రవేశించిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారులను ఇవాళ పాకిస్థాన్ విడుదల చేయనుంది. ఈ సందర్భంగా వారిని రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు మంత్రి మోపిదేవి వెంకటరమణ వాఘాకు బయలుదేరారు.
వాఘాకు పయనమైన మంత్రి మోపిదేవి
Last Updated : Jan 6, 2020, 3:37 AM IST