Money Saving Tips : ఈ రోజు ఎంత ముఖ్యమో రేపన్నది అంతకంటే ముఖ్యం. భవిష్యత్తుకు భరోసా ఉంటేనే ప్రశాంతంగా నిద్రపోగలం. సరైన బీమా పాలసీలు తీసుకోవడం, వాటికి నామినీలను పక్కాగా ఏర్పాటు చేయడం, ఆ విషయాలు వారికి తెలియజెప్పడం.. ఇవన్నీ ఎంతో ముఖ్యం. ప్రతి ఒక్కరికీ ఆరోగ్యబీమా సైతం అత్యవసరమే. మరి మీరేం చేస్తున్నారు? రోజుకు రూపాయి కడితేనే ఏడాదికి రూ. 2లక్షల జీవితబీమా వస్తుందని మీకు తెలుసా? నెలకు రూపాయి కడితే ఏడాదికి రూ.2లక్షల ప్రమాద బీమా ఉందన్న విషయం విన్నారా? భవిష్యత్తును భద్రంగా ఉంచుకోవాలంటే ఇవన్నీ తప్పనిసరి మరి!!
వార్షికాదాయానికి 15 రెట్లు
Money Saving Policies : కరోనా తర్వాత అందరికీ బీమా ప్రాధాన్యం బాగా అర్థమయ్యింది. ప్రతి ఒక్కరూ కచ్చితంగా జీవిత, ఆరోగ్య బీమాలకు తగినంత ప్రాధాన్యం ఇవ్వాలి. బీమా పాలసీలను పెట్టుబడి దృష్టితో చూడకుండా.. రక్షణ అవసరాలకే పరిమితం చేయండి. వార్షికాదాయానికి 15 రెట్ల వరకూ విలువైన టర్మ్ పాలసీని తీసుకోండి.
ఆరోగ్యానికీ అండ ఉండాల్సిందే
Health Insurance Policies : కొవిడ్-19 తొలిదశలో ఆరోగ్య బీమా పాలసీలు లేక చేతిలో ఉన్న డబ్బు, పొదుపు, పెట్టుబడులనూ చికిత్స కోసం ఖర్చుచేశారు. అందుకే కుటుంబమంతటికీ వర్తించే ఫ్యామిలీ ఫ్లోటర్ ఆరోగ్యబీమా రూ.5-10 లక్షల వరకు తీసుకోవాలి. వ్యక్తిగత ప్రమాద బీమా, వైకల్యం, క్రిటికల్ ఇల్‌నెస్ పాలసీలూ అవసరమే. బీమా వివరాలను కుటుంబ సభ్యులందరికీ తప్పక చెప్పాలి.
ఆ తర్వాత ఏం చేద్దాం?
Insurance Policies : పింఛను అవకాశం లేని చాలామందికి పదవీ విరమణ తర్వాత ఏం చేయాలో స్పష్టత ఉండదు. పదేళ్ల ముందునుంచి ఏడాదికి ఇంత మొత్తమని మదుపుచేస్తే.. తర్వాత ఏటా నిర్దిష్టమొత్తం చేతికి అందుతుంది.