తెలంగాణలో లోన్‌యాప్ ఆగడాలకు తట్టుకోలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సికింద్రాబాద్ పరిధిలోని చెన్నపురం సాయిగణేశ్‌కాలనీలో ఉంటున్న మహమ్మద్ ఖాజా అనే యువకుడు 3 లోన్ యాప్స్ ద్వారా అవసరాల నిమిత్తం డబ్బులు తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Loan apps: లోన్‌యాప్స్ వేధింపులకు... మరో యువకుడు బలి
తెలంగాణలో రుణయాప్‌ల వలలో చిక్కుకుని కొంతమంది సామాన్యులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అవసరం కోసం తీసుకున్న లోన్ ఆపద సమయంలో ఆదుకుంటుంది అనుకుంటే అది పొరపాటే అని నిరూపిస్తున్నాయి రుణయాప్‌లు. చివరికి బెదిరించి, భయపెట్టి పైశాచికి ఆనందాన్ని పొందుతున్నాయి. ఈ మనోవేదన తాళలేక కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతూ తనువు చాలిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ ఓ యువకుడి ఈ లోన్‌యాప్ ఆగడాలకు తట్టుకోలేక ప్రాణాలు తీసుకున్నాడు.
లోన్‌యాప్స్ వేధింపులు
అనంతరం వారి నుంచి డబ్బులు చెల్లించాలంటూ విపరీతమైన ఒత్తిడి రావడంతో వేధింపులు తట్టుకోలేక ఉదయం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: