అమరావతి స్మార్ట్, సస్టెయినబుల్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్‌లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల వాటాల్లో సవరణలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) చట్టం రద్దు కావటంతో ఆ స్థానంలో వచ్చిన అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్‌ను స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓగా కొనసాగేలా సవరణ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
స్మార్ట్ సిటీ ప్రాజెక్టు డైరెక్టర్ల వాటాల్లో సవరణలు - Director on the Smart City Project
అమరావతి స్మార్ట్, సస్టెయినబుల్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్‌లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, వాటాల్లో సవరణలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్‌ను స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓగా కొనసాగేలా సవరణ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో డైరెక్టర్‌గా వాటాల్లో సవరణలు
అమరావతి స్మార్ట్, సస్టెయినబుల్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్‌లో పది రూపాయల ముఖవిలువ కలిగిన 24,997 వాటాల భాగస్వామిగా ఆ సంస్థ ఎండీ, సీఈఓ కొనసాగుతారని ప్రభుత్వం పేర్కొంది. బోర్డు డైరెక్టర్లుగా ఏఎంఆర్డీఏ అదనపు కమిషనర్, చీఫ్ ఇంజనీర్లు వ్యవహరిస్తారని సర్కార్ స్పష్టం చేసింది. స్పెషల్ కమిషనర్ స్థానంలో బోర్డు డైరెక్టర్‌గా పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి ఉంటారని వెల్లడించింది.
ఇదీచదవండి.