ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారిన తుపానుపై.. అధికారులు అప్రమత్తమయ్యారు. నెల్లూరు కలెక్టర్ అధికారులను అప్రమత్తం చేశారు. దుగరాజపట్నం తుపాను షెల్టర్‌ను కలెక్టర్ చక్రధర్‌బాబు పరిశీలించారు. లోతట్టు ప్రాంత ప్రజలను తుపాను షెల్టర్ కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. విద్యుత్, వైద్యశాఖ అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నెల్లూరు జిల్లా కేంద్రంలో టోల్‌ఫ్రీ నెం.1077 ఏర్పాటు చేశామని తెలిపారు.
తుపాను దృష్ట్యా కృష్ణా జిల్లాలో లోతట్టు గ్రామాల ప్రజలను కలెక్టర్ ఇంతియాజ్ అప్రమత్తం చేశారు. అధికారులు, రెవెన్యూ యంత్రాంగానికి పలు ఆదేశాలు జారీచేశారు. అన్ని డివిజనల్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటుచేశారు. బందర్ కంట్రోల్ రూమ్ నెం. 08672 252572, విజయవాడలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం కంట్రోల్ రూమ్ నెం. 0866 2474805, విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయం కంట్రోల్ రూమ్ నెం.0866 2574454, నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయం కంట్రోల్ రూమ్ నెం. 08656 232717, రెవెన్యూ డివిజనల్ కార్యాలయం బందర్ ఫోన్ నెంబర్. 08672 252486, గుడివాడ రెవెన్యూ డివిజనల్ కార్యాలయం ఫోన్ నెంబర్. 08674 243697లు ఏర్పాటుచేశామన్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.