ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఉపాధ్యాయులకు మొబైల్‌ ఈ-హాజరు - మొబైల్‌ ఈ-హాజరు

ఉపాధ్యాయుల ఆన్‌లైన్‌ హాజరుకు పాఠశాల విద్యాశాఖ నాలుగు రకాల యాప్‌లను రూపొందించింది. గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో ఈనెల 26న ప్రయోగాత్మక పరిశీలన ప్రారంభించగా.. తూర్పుగోదావరి జిల్లాలో మంగళవారం నుంచి పరిశీలన చేపట్టనున్నారు.

మొబైల్‌ ఈ-హాజరు
మొబైల్‌ ఈ-హాజరు

By

Published : Mar 29, 2022, 6:02 AM IST

సెల్‌ఫోన్‌ల ద్వారా ఉపాధ్యాయుల ఆన్‌లైన్‌ హాజరుకు పాఠశాల విద్యాశాఖ నాలుగు రకాల యాప్‌లను రూపొందించింది. వీటిని నాలుగు జోన్లలోని పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా పరిశీలన చేస్తోంది. గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో ఈనెల 26న ప్రయోగాత్మక పరిశీలన ప్రారంభించగా.. తూర్పుగోదావరి జిల్లాలో మంగళవారం నుంచి పరిశీలన చేపట్టనున్నారు. అనంతపురంలో ఈనెల 31న, ప్రకాశంలో ఏప్రిల్‌ 1నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో మొదట 15మండలాల్లో అమలు చేయనున్నారు.

అక్కడ వచ్చే ఫలితాల ఆధారంగా జిల్లా మొత్తం ఈ యాప్‌ ఆధారిత హాజరును అమల్లోకి తీసుకువస్తారు. హాజరు యాప్‌ను ఉపాధ్యాయులు తమ సెల్‌ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పాఠశాల వద్ద మాత్రమే హాజరు నమోదుకు అవకాశం ఉంటుంది. వచ్చే ఏడాది నుంచి విద్యార్థుల హాజరు ఆన్‌లైన్‌లోనే తీసుకోనున్నారు. ఇప్పటికే కృష్ణా జిల్లాలో జనవరి నుంచి అమలు చేస్తున్న విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు. సెల్‌ఫోన్‌లోని యాప్‌ ద్వారా తరగతిలోని పిల్లల ఫొటో తీసి, ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఫొటోలోని విద్యార్థుల ఆధారంగా హాజరు నమోదవుతుంది. కృత్రిమేథ సాంకేతికతతో విద్యార్థులను గుర్తిస్తున్నారు.

ఎయిడెడ్‌కు పదవీ విరమణ వయసు పెంపుపై స్పష్టత ఇవ్వండి :ఎయిడెడ్‌ విద్యా సంస్థల్లో పని చేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచడంపై స్పష్టతనివ్వాలని కోరుతూ పాఠశాల విద్య కమిషనర్‌కు గుంటూరు జిల్లా విద్యాధికారి లేఖ రాశారు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో ఎయిడెడ్‌ సంస్థలకు వర్తిస్తుందో లేదో చెప్పాలని టీచర్స్‌ గిల్డ్‌ కోరిందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:అప్పుల ఊబిలో కూరుకుపోతోన్న రాష్ట్రం... రుణ భారం 7.76 లక్షల కోట్లు?

ABOUT THE AUTHOR

...view details