హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని వన్‌డ్రైవ్ ఫుడ్ కోర్టులో దారుణం చోటు చేసుకుంది. మహిళల బాత్‌రూమ్(Camera in bathroom)లో సెల్‌ఫోన్‌తో రహస్య చిత్రీకరణ జరపడం కలకలం రేపింది. ఫుడ్‌కోర్టుకు తన స్నేహితులతో కలిసి వెళ్లిన ఓ యువతి రెస్ట్రూమ్కు వెళ్లింది. అక్కడి బాత్‌రూమ్‌లో కెమెరా ఆన్‌చేసిన సెల్‌ఫోన్‌ను గుర్తించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
Camera in bathroom : జూబ్లీహిల్స్‌లో దారుణం... మహిళల బాత్‌రూమ్‌లో కెమెరా - camera in bathroom at restaurant
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఓ ఫుడ్‌కోర్టులోని బాత్‌రూమ్(Camera in bathroom)లో కెమెరా ఆన్‌చేసిన సెల్‌ఫోన్ ఉండటం కలకలం రేపింది. స్నేహితులతో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లిన ఓ యువతి రెస్ట్రూమ్కు వెళ్లింది. అక్కడ కెమెరా ఆన్‌చేసిన మొబైల్ ఉండటం గమనించి ఖంగుతిన్నది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మహిళల బాత్‌రూమ్‌లో కెమెరా
రంగంలోకి దిగిన పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. నిన్నంతా ఫోన్ కెమెరా ఆన్‌లోనే ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. బాత్‌రూమ్ క్లీనర్ బెనర్జీ ఫోన్ కెమెరా అమర్చినట్టు దర్యాప్తులో తేలింది. బెనర్జీని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.