Mobile App to Crop Details: తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ సరికొత్త ఆలోచనకు నాంది పలికింది. రాష్ట్రంలో ప్రతీ రైతు ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేశారనే వివరాలను ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేసేందుకు ప్రత్యేక మొబైల్ యాప్‌ను రూపొందించింది. శనివారం హాకా భవన సమావేశ మందిరంలో వ్యవసాయాధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారుల(ఏఈవో)తో నిర్వహించిన సమావేశంలో ఈ యాప్‌ను వ్యవసాయ కమిషనర్ రఘునందన్‌రావు ఆవిష్కరించారు. రాబోయే వానాకాలం సీజన్‌లో రైతులకు సంబంధించిన అన్ని వివరాలను ఏఈవోలు యాప్‌లో పక్కాగా నమోదు చేయాలని సూచించారు. అయితే.. రైతులకు చెల్లింపులు, పంటల వివరాల నమోదు వంటి సాధారణ పనులతోనే తమకు సరిపోతోందని.. పంటల సాగుకు సంబంధించిన శాస్త్రీయ అంశాలను వారికి చెప్పలేకపోతున్నామని పలువురు ఏఈవోలు వివరించారు.
ఆ వ్యవసాయశాఖ ప్రత్యేక మొబైల్ యాప్.. ఎందుకంటే?
Mobile App to Crop Details: తెలంగాణలో ప్రతీ రైతు సాగు చేసే పంటల వివరాలు నమోదుకు చేసేందుకు ఆ రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రత్యేక మొబైల్ యాప్‌ను ఆవిష్కరించింది. రాబోయే వానాకాలం సీజన్‌లో రైతులకు సంబంధించిన అన్ని వివరాలను ఏఈవోలు ఈ యాప్‌లో నమోదు చేయాలని ఆ రాష్ట్ర కమిషనర్ సూచించారు.
పట్టల వివరాల కోసం మొబైల్ యాప్