అనుమతుల్లేని, అనధికార ప్లాట్లు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ ఉత్తర్వులను ఇప్పటికే జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం... అందుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించింది. ఆన్ లైన్ ద్వారా క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా వెబ్ సైట్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. lrs.telangana.gov.inవెబ్ సైట్ను సుపరిపాలనా కేంద్రం రూపొందించింది. ప్రత్యేకంగా మొబైల్ అప్లికేషన్ను కూడా రూపొందించారు. ఆండ్రాయిడ్ మొబైళ్లలో ప్లే స్టోర్ ద్వారా ఎల్ఆర్ఎస్ 2020 టైప్ చేస్తే సీజీజీ సిద్ధం చేసిన యాప్ వస్తుంది. యాప్ ద్వారా కూడా క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొబైల్ నంబర్ సహాయంతో దరఖాస్తు చేయవచ్చు.
రుసుములు చెల్లించాలి
ఎల్ఆర్ఎస్కు సంబంధించిన పూర్తి ఉత్తర్వులు, వివరాలతో పాటు తరచూ అడిగే ప్రశ్నలు, ఇతర సమాచారాన్ని వెబ్ సైట్లో, యాప్లో పొందుపరిచారు. ప్లాటు క్రమబద్ధీకరణ కోసం సేల్ డీడ్, లేఅవుట్ కాపీ అవసరం. లేఅవుట్ క్రమబద్ధీకరణ కోసమైతే లేఅవుట్తో పాటు యాజమాన్య పత్రాలు, ఇప్పటికే అమ్మిన ప్లాట్లకు సంబంధించిన సేల్ డీడ్లు, ఈసీ కాపీలు అవసరం. ప్లాట్ల దరఖాస్తుదారులు వెయ్యి రూపాయలు, లేఅవుట్ల దరఖాస్తుదారులు పదివేల రూపాయలు దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.