ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Rape attempt: ఆపరేషన్​ థియేటర్​లోనే... గర్భిణిపై అత్యాచార యత్నం - భద్రాచలంలో గర్భిణిపై అత్యాచారయత్నం

Rape Attempt on Pregnant Lady : రోజురోజుకు మానవ మృగాలు రెచ్చిపోతున్నారు... వావివరుసలు మరిచిపోతున్నారు... చిన్నాపెద్దా తేడా లేకుండా పోయింది... సమయం, స్థలంతో సంబంధంలేకుండా ఎక్కడపడితే అక్కడ మగువలపై దారుణాలకు ఒడిగడుతున్నారు... తాజాగా ఓ మృగం ఏకంగా ప్రసవం కోసం వచ్చిన మహిళపై ఆపరేషన్​ థియేటర్​లోనే అత్యాచారయత్నానికి చేశాడు... ఈ అమానవీయ ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది...

Rape Attempt on Pregnant Lady
గర్భిణిపై అత్యాచారానికి యత్నం

By

Published : Apr 29, 2022, 3:49 PM IST

Rape Attempt on Pregnant Lady : భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ప్రసవం కోసం వచ్చిన ఓ మహిళపై ఆపరేషన్ థియేటర్‌లో అత్యాచారయత్నం జరిగింది. మత్తు మందు ఇచ్చి గర్భిణిపై ఎంఎన్‌వో లాల్‌ఖాన్ అత్యాచారయత్నం చేశాడు. గర్భిణిపై అత్యాచారానికి ప్రయత్నిస్తుండగా చూసిన మరో ఉద్యోగి అతణ్ని అడ్డుకున్నాడు. లాల్‌ఖాన్‌పై సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశాడు. ఆసుపత్రి సూపరింటెండెంట్.. ఎంఎన్‌వో లాల్‌ఖాన్‌కు మెమో జారీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details