ఆలయ ఆస్తుల పరిరక్షణ బాధ్యత ప్రభుత్వానిదే కాకుండా.. ప్రజలపై కూడా ఉందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయవాడలో అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. దేవాలయ భూములు, భవనాల వివరాలు ఆన్లైన్ చేసేందుకు చర్యలు చేపట్టాలని దేవదాయశాఖ కమిషనర్‌ను మంత్రి ఆదేశించారు.
ఆలయాల్లోకి భక్తులను నిబంధనల ప్రకారమే అనుమతిస్తామని మంత్రి వెల్లంపల్లి స్పష్టం చేశారు. ప్రధాన ఆలయాల్లోని సాప్ట్‌వేర్‌ను పీటీఎస్ ద్వారా అనుసంధానం చేయాలని అధికారులకు సూచించారు.