రమేష్ ఆసుపత్రి ఎండీ రమేష్ బాబు పై దుష్ప్రచారం చేయడం, కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా మాట్లాడటం దారుణమని ఎమ్మెల్సీ వై.వి.బి రాజేంద్రప్రసాద్ విమర్శించారు. ప్రభుత్వం కావాలనే ప్రముఖులపై కులముద్ర వేసి కక్షసాధిస్తోందని మండిపడ్డారు. వైద్యవర్గాన్నే భయభ్రాంతులకు గురిచేసేలా ప్రభుత్వం వ్యవహరించడం సిగ్గుచేటని అన్నారు. మహిళలను కూడా విచారణ పేరుతో వేధిస్తున్నారని ఆక్షేపించారు.
రమేష్‌పై ప్రభుత్వం కక్షసాధిస్తుంది : వైవీబీ - వైసీపీపై వైవీబీ రాజేంద్రప్రసాద్ కామెంట్స్
రమేష్ ఆసుపత్రి ఎండీపై ప్రభుత్వం కక్షసాధిస్తుందని ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ విమర్శించారు. వివిధ రంగాల్లో ఉన్న ప్రముఖులపై ప్రభుత్వం కులముద్ర వేస్తుందని ఆరోపించారు. లక్షల కోట్ల అవినీతి పాల్పడి 18 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి బయట తిరుగుతున్నప్పుడు.... రమేష్ బాబు ఎందుకు దాక్కుంటారని ప్రశ్నించారు.
వైవీబీ రాజేంద్రప్రసాద్
లక్షల కోట్ల అవినీతికి పాల్పడి సీబీఐ, ఈడీ కేసుల్లో 18 నెలలు జైల్లో ఉండివచ్చిన వ్యక్తే బయట తిరుగుతుంటే తప్పుచేయని రమేష్ బాబు ఎందుకు దాక్కుంటున్నారని నిలదీశారు. రమేష్ ఆసుపత్రి ఎండీని వేటాడుతున్న సీఎం జగన్, ఎల్జీ పాలిమర్స్ ఎండీ, ఛైర్మన్, డైరెక్టర్లను, వారి బంధువులను, ఎందుకు పిలిపించి విచారించడంలేదని ప్రశ్నించారు.
ఇదీ చదవండి :స్వచ్ఛ సర్వేక్షణ్ - 2020: విజయవాడకు నాలుగో స్థానం