తెలంగాణలో రేపు జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, పట్టభద్రులు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ కోరారు. కేవలం ఈసీ ఇచ్చిన స్కెచ్‌పెన్‌తో మాత్రమే ప్రాధాన్యతా క్రమంలో ఓటు వేయాలని చెప్పారు. ఎన్నికల సందర్భంగా ఓటర్లను ఎక్కడా ఎలాంటి ప్రలోభాలకు గురిచేయకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు సీఈఓ చెప్పారు. ఓటింగ్ వేసే క్రమంలో ఒక్కరి కంటే ఎక్కువ మందికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయకూడదని, వేలి ముద్రలు, ఇతర గుర్తులు పెట్టకూడదని సూచించారు.
'తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ కోసం ఏర్పాట్లు పూర్తి' - State Chief Electoral Officer Shashank Goyal
తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు రేపు జరిగే ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ సూచించారు. ఈసారి పోటీ చేసే అభ్యర్థులు ఎక్కువగా ఉన్నందున.. ఓటర్లు జాగ్రత్తగా ఈసీ ఇచ్చిన స్కెచ్‌పెన్‌తో మాత్రమే ప్రాధాన్యతా క్రమంలో ఓటు వేయాలని కోరారు. వేలి ముద్రలు, ఒక్కరికే రెండు ఓట్లు, ఇద్దరికి మొదటి ప్రాధానత్య ఓటు తదితర ఇతర గుర్తులు పెట్టుకూడదని తెలిపారు.
రాష్ట్రంలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఈసారి కొత్త అభ్యర్థులు పెద్ద ఎత్తున ఓటు హక్కును నమోదు చేసుకున్నారని అన్నారు. పోటీ చేసే అభ్యర్థులు కూడా ఎక్కువగా ఉన్నారని... హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌లో 93, నల్గొండ, ఖమ్మం, వరంగల్‌లో 71 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని పేర్కొన్నారు. అభ్యర్థులను అనుసరించి పెద్ద సైజులో ఉన్న బ్యాలెట్ పేపర్‌ను ఈసారి ఉపయోగిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఐదు మంది సిబ్బంది ఉంటారని.. కొవిడ్ నింబంధనలు సైతం పాటిస్తున్నట్లు చెప్పారు. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుందని వివరించారు.
ఇదీ చూడండి :ఎన్నికలు ముగిసి 48 గంటలు కాకముందే ప్రజలపై దాడులా..?