వైకాపా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు సంబంధించిన ఓ ఆడియో సామాజిక మాధ్యమాల్లో కలకలం రేపుతోంది. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో తోట త్రిమూర్తులు ఫొటోతో ఫ్లెక్సీలు పెట్టారు. నెలలు గడుస్తున్నా వాటిని తొలగించలేదు. వర్షాకాలం నేపథ్యంలో కొన్ని ఫ్లెక్సీలతో ప్రజలకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని.. వాటిని తొలగించాలని స్థానిక నాయకుడు నల్లమిల్లి వీర్రెడ్డి.. పురపాలక సంఘం అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై తన మిత్రుడైన 7వ వార్డు కౌన్సిలర్ సవరపు సతీష్‌కి త్రిమూర్తులు ఫోన్ చేసి బెదిరించారని వీర్రెడ్డి తెలిపారు. తనకు ఏదైనా జరిగితే తోట త్రిమూర్తులదే బాధ్యత అని అన్నారు.
ఆడియో కాల్లో ఏముందంటే...!
'వీర్రెడ్డికి చెప్పు. నేను అందరిలా కాదు. కాళ్లు, చేతులూ తీయించేస్తానని చెప్పు. ఫ్లెక్సీలు తీయించేయాలంటూ పిటిషన్లు ఇవ్వడమేంటి..? వాడికి పోయే కాలమేంటి..? సామాజిక మాధ్యమాల్లోనూ పోస్టులు పెడుతున్నాడు.. ఏంటీ సంగతి..! పిలిపించి చెబుతాను వాడి సంగతి'