బ్యాంకుల ముందు చెత్త వేసి అంశంలో ఉయ్యూరు మున్సిపల్ కమిషనర్ ప్రకాశరావునే ఎందుకు సస్పెండ్ చేశారని తెదేపా ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ప్రశ్నించారు. అదే రోజున చెత్త వేసిన విజయవాడ, మచిలీపట్నం, నూజివీడు మున్సిపల్ కమిషనర్లను ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. ప్రకాశరావు ఎస్సీ అనే చులకన భావనతో వైకాపా ప్రభుత్వం సస్పెండ్ చేసిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతోనే బ్యాంకుల ముందు చెత్త వేశారని రాజేంద్రప్రసాద్ విమర్శించారు. ఈ వ్యవహారంపై సీఎం జగన్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం చేసిన 'చెత్త' పనికి.. అధికారులు బలి పశువులా? - బ్యాంకు ముందు చెత్త వివాదంపై తెదేపా వ్యాఖ్యలు
బ్యాంకుల ముందు చెత్త వేసి అంశంలో ఉయ్యూరు మున్సిపల్ కమిషనర్ ప్రకాశరావును మాత్రమే ఎందుకు సస్పెండ్ చేశారని తెదేపా ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ నిలదీశారు. అదే రోజున చెత్త వేసిన విజయవాడ, మచిలీపట్నం, నూజివీడు మున్సిపల్ కమిషనర్లను ఎందుకు సస్పెండ్ చెయ్యలేదని రాజంద్రప్రసాద్ అన్నారు.
తెదేపా ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్