సీఆర్డీఏ రద్దు, పాలనా వికేంద్రీకరణ బిల్లులను గవర్నర్ ఆమోదించవద్దని కోరుతున్నామని ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ అన్నారు. బిల్లులను మండలి సెలెక్ట్ కమిటీకి పంపిందని.. గవర్నర్ ఎలా ఆమోదిస్తారని ప్రశ్నించారు. బిల్లులపై హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ గుర్తుచేశారు.
'ఆ రెండు బిల్లులను గవర్నర్ ఆమోదిస్తే సుప్రీంకు వెళ్తాం'
సీఆర్డీఏ రద్దు, పాలనా వికేంద్రీకరణ బిల్లులను గవర్నర్ ఆమోదిస్తే సుప్రీంకోర్టుకు వెళ్తామని తెదేపా ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ అన్నారు. బిల్లులను మండలి సెలెక్ట్ కమిటీకి పంపిందని.. గవర్నర్ ఎలా ఆమోదిస్తారని ప్రశ్నించారు.
సీఆర్డీఏ రద్దు, పాలనా వికేంద్రీకరణ బిల్లుపై ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్
బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా రాష్ట్రపతి పరిశీలనకు పంపాలని ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ కోరారు. బిల్లులను గవర్నర్ ఆమోదిస్తే సుప్రీంకోర్టుకు వెళ్తామని రాజేంద్రప్రసాద్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: గవర్నర్ ఆమోదానికి సీఆర్డీఏ, మూడు రాజధానుల బిల్లులు